17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

వృధా అవుతున్న మంజీరా జలాలు... జీవధార

10-02-2026 07:36 PM

నదిని తలపిస్తున్న చెన్నాపురం రోడ్డు

నీటి వృధాను అరికట్టాలని ప్రజల వేడుకోలు

జవహర్ నగర్,(విజయక్రాంతి): కీసర సర్కిల్ పరిధిలోని జిహెచ్ఎంసి జవహర్ నగర్ చెన్నాపురం చౌరస్తాలో మంగళవారం మంచినీటి పైప్ లైన్ లీక్ అయి భారీ ఎత్తున మంచినీరు వృధా అవుతున్నా పట్టించుకోని జలమండలి అధికారులు. ఈ సందర్భంగా చెన్నాపురం వాసులు మీడియాతో మాట్లాడుతూ మంజీరా నీరు భారీ ఎత్తున వృధా అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్ నగర్లో అసలేనీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా మురికినీటి బోర్డు (హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి) అధికారులు నిర్లక్ష్యంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

అసలే ఎండాకాలం సమీపిస్తుండగా దీనికి తోడు జవహర్ నగర్ లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా వీటికి తోడు తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డచందంగా నీటి కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల మంచినీరు వృధా గా పోవడం బాధాకరం.

మంగళవారం చెన్నపురం చౌరస్తాలో మంజీరా పైప్లైన్ లీకై పెద్ద ఎత్తున నీరు వృధా కావడం ప్రజలకు తాగునీరు దొరకక ఇబ్బందులు పడుతుంటే అధికారుల అలసత్వం వల్ల నీరు వృధా పోవడం శోచనీయమని చెన్నాపురం ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి భవిష్యత్తులో నీటి వృధాను అరికట్టాలని శాశ్విత చర్యలు తీసుకొని మంజీరా నీరు వృధాగా పోకుండా శాశ్విత చర్యలు తీసుకోవాలని జవహర్ నగర్ ప్రజలు వేడుకుంటున్నారు.