1 July, 2026 | 10:24 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ధాన్యంలో తేమశాతం చూసి వెంటనే కొనుగోలు చేయాలి

01-11-2025 12:00 AM

యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 31 ( విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యం కుప్పలు తేమ శాతం చూసి వెంటనే కాంటావేసి కొనుగోలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరు పి.ఏ.సి.ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మందనపల్లి గ్రామంలో ఎఫ్ .పి.ఓ ఆధ్వర్యంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేంద్రంలో ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడుతూ..ఎన్ని రోజులు అయింది వచ్చి, ఎన్ని ఎకరాలు వేశారు. మొన్న కురిసిన వర్షానికి ఏమైనా ధాన్యం తడిసిందా  అని అడిగి తెలుసుకున్నారు. రైతు మూడు నాలుగు రోజులు అయిందని తెలిపారు. ధాన్యం ఆరబోసిన తేమశాతం వచ్చే సమయానికి వర్షం రావడంతో మళ్లీ కొంచెం తడిసిందని తెలిపారు.

రెండు రోజులు ఎండలు బాగా రావడంతో ధాన్యం ఆరబెడుతున్నామన్నారు. ఉదయం వచ్చి తేమ శాతం చూసి సాయంత్రం  ధాన్యం కొనుగోలు కాంటాకి వేస్తామని అధికారులు తెలియజేశారన్నారు.  కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.