సిద్దాపూర్ నుంచి చలో కలెక్టరేట్
- ప్రభుత్వం డంపింగ్ ప్రతిపాదన వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం ఆగదు
- మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
షాద్నగర్ మే 28 (విజయక్రాంతి): సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బిఆర్‌ఎస్ డంపింగ్ పోరాట వ్యతిరేక కమిటీ కలెక్టరేట్ వరకు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. జూన్ 1 సోమవారం రోజున ఉదయం 7 గంటల 30 నిమిషాలకు యాత్ర ప్రారంభం అవుతుందని బిఆర్‌ఎస్ డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ కన్వీనర్ బొజ్జ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తూరు మండల పరిధిలోని వివిధ గ్రామల ప్రజలు పార్టీలకతీతంగా ఇదే మా ఆహ్వానంగా భావించి యువకులు, మహిళలు, రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.
షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గురువారం డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సిద్దాపూర్ లో *చలో కలెక్టరేట్* కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ ఎమ్మె సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై దిశా నిర్దేశం చేశారు. తదుపరి అయన *చలో కలెక్టరేట్* యాత్ర షెడ్యూల్ విడుదల చేశారు.
షెడ్యూల్ ఇలా..
సిద్దాపూర్ హనుమాన్ దేవాలయం నుండి ఉదయం 7:30 నిమిషాలకు యాత్ర ప్రారంభమై 8 :30 నిమిషాలకు ఎస్ బి పల్లి, 9 గంటలకు దిలవర్ గూడా, 9:15 నిమిషాలకు సుభాన్ పూర్, 9:30 ని మిషాలకు దుబ్బచర్ల, 10 గంటలకు మన్సా న్ పల్లి, 11 గంటలకు మహేశ్వరం, 11:30 నిమిషాలకు తుక్కుగూడా మీదుగా 12 గంటల 30 నిమిషాలకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ కోఆర్డినేటర్ కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్,ఆర్గనైజర్ లు భాతుక దేవేందర్ యాదవ్, మెండే కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






