పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం
పెట్రోల్ లీటర్‌పై రూ.13 నుంచి రూ.3కు తగ్గింపు
డీజిల్‌పై లీటర్‌కు రూ.10 నుంచి సున్నాకు తగ్గింపు
న్యూఢిల్లీ: చమురు కంపెనీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం(Central Government) చర్యలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం(Excise Duty) రూ. 10 తగ్గించింది. పెట్రోలో పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 13 నుంచి రూ. 3 కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. రూ. 10 తగ్గింపుతో డీజిల్ పై ఎక్సైజ్ సుంకం సున్నాకు చేరింది. ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో చమురు సంస్థలపై భారం తగ్గనుంది. పశ్చిమాసియాలో యుద్ధం(West Asian War) వల్ల చమురు ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. యుద్ధం వల్ల నెలరోజుల్లో అంతర్జాతీయ చమురు ధరలు 50 శాతం పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్(Barrel of Brent Crude Oil) ధర వంద డాలర్ల మార్క్ దాటింది. కేంద్ర నిర్ణయంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.




