29 May, 2026 | 8:53 PM

ధాన్యం కొనుగోలుపై కేంద్రం నిర్లక్ష్యం

29-05-2026 01:15 PM

బిజెపి నాయకులు కొనుగోలు కేంద్రాల వద్ద డ్రామాలు చేస్తున్నారు

ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పై కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని, దాన్ని అలుసుగా తీసుకుని రాష్ట్రంలో బిజెపి నాయకులు కొనుగోలు కేంద్రాల వద్ద డ్రామాలు చేస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పందించకుండా తెలంగాణ బిజెపి మాత్రం కొనుగోలు కేంద్రాల వద్ద డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రైతుల ధాన్యం కొనుగోలు పై కేంద్రాన్ని ఒప్పించడంలో పూర్తిగా విఫలమైనారని విమర్శించారు. సమావేశంలో ఆదివాసి కాంగ్రెస్ నాయకులు ఆత్రం రాజేశ్వర్, వసంతరావు, వెడ్మ శేఖర్ తదితరులు ఉన్నారు.