6 July, 2026 | 2:05 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

23మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం

05-07-2026 12:00 AM

ఉపా చట్టం కింద నిషేధం విధింపు

న్యూఢిల్లీ, జూలై 4 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగానే తాజాగా పాకిస్తాన్‌కు చెందిన 23 మందిని ఉగ్రవాదులుగా శనివారం ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ‘ఉపా’ చట్టం కింద ఈ గ్రూపులలోని వ్యక్తులను ఉగ్రవాదులుగా గుర్తించి నిషేధాన్ని విధించింది. 2019లో చేసిన సవరణలతో 23 మంది వ్యక్తులతో కలిపి ప్రకటించిన ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరింది.

జైష్ ఎ మహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, జమాత్ ఉద్ దవా, హర్కత్ ఉల్ ముజాహిదీన్, ది రెసిస్టెన్స్ ఫ్‌రండ్, ఫలాహ్ ఎ ఇన్సానియత్ ఫౌండేషన్‌లతో సంబంధం ఉన్న 23 మంది వ్యక్తులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. 23మందిలో 17 మంది పాకిస్తానీయులు కాగా, ఆరుగురు భారత జాతీయులు వీరు పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రం ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 

ఉగ్రవాదుల పేర్లు..

జేఈఎం  మసూద్, మహ్మద్ ముసాదిక్, ముఫ్తీ మహ్మద్ అస్గర్ ఖాన్, అష్ఫాక్ అహ్మద్, అబ్దుల్లా జిహాదీ, హఫీజ్ అబ్దుల్ షకూర్, గులాం ఫరీద్, హులామ్ ఫరీద్, ఎల్‌ఇటీ  ఫిర్దౌస్ అహ్మద్ భట్, బిలాల్ అహ్మద్ మీర్, నజీర్ అహ్మద్ గుజ్జర్, అబ్దుల్ రవూఫ్, హఫీజ్ ఖలీద్ వాలిద్, యాకూబ్, యూసుఫ్ తైబీ, ఒవైస్ ఫరూజ్, రానా ఇఫ్తికార్, వసీం నూర్ జాట్, మహ్మద్ షాహిద్ ఫైసల్, ఇతర గ్రూపులకు చెందిన వారిలో మౌలానా ఇమ్దాద్ ఉల్లా మక్కీ, యాకూబ్ షేక్‌లను ఉగ్రవాదులకు ప్రకటించింది.