6 July, 2026 | 3:08 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

నేడు అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం

05-07-2026 12:00 AM

వాషింగ్టన్, జూలై 4: అమెరికన్ పౌరులు ఆదివారం ఘనంగా తమ 250వ దినోత్సవ వేడుకలు జరుపుకోనున్నారు. వాషింగ్టన్ తోపాటు ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్నిచోట్ల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 250 ఏళ్ల మైలురాయి కావడంతో దేశపౌరులు మునుపటికంటే ఉత్సాహంగా వేడుకల్లో భాగస్వాములు కానున్నారు. నగరాలు, పట్టణాలన్నీ పరేడ్స్, మ్యూజికల్ ఈవెంట్స్, సాంస్కృతిక ప్రదర్శనకు ముస్తాబయ్యాయి.

దీంతో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. వాషింగ్టన్‌లో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో భారీగా వేడుకలు జరుగనున్నాయి. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటి సారి సిబ్బంది 8.౫౦ లక్షల మేర పటాకులు కాల్చేందుకు సరంజామా సిద్ధం చేశారంటే, వేడుకలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వాషింగ్టన్ నగరమంతా భద్రతా దళాల పహారాలోకి వెళ్లింది. నగరవ్యాప్తంగా ౫ వేల మంది నేషనల్ గార్డ్ సైనికులు మోహరించారు.