8 August, 2026 | 5:34 PM

Breaking News

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు   •   శ్రీవాణి లో బోనాలు, గోరింటాకు సంబరాలు   •   ప్రభుత్వ సెలవుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!   •   ముగింపు దశకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐపీఎస్‌ విద్యార్థి సత్తా   •   బోర్లగూడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి   •   రెండవ దశ ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు   •   ఫారం పండు పనులతో భూగర్భ జలాలు పెంపు.   •   నో పార్కింగ్‌ బోర్డులు.. అయినా అదే తీరు!   •   క్విట్‌ ఇండియా స్ఫూర్తితో కార్మిక కోడుల రద్దు వరకు ఉద్యమిద్దాం   •  

కేంద్ర ప్రభుత్వం విద్యా, వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలి

08-08-2026 02:39 PM

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ డిమాండ్

బాన్సువాడ,(విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ సిపిఐ పార్టీ  రాష్ట్ర సమితి పిలుపు మేరకు శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ  సభ్యురాలు పశ్య పద్మ  విచ్చేసి అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్య వైద్యం అందించాలని ప్రతి యువకుడికి ఉపాధి కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలను అరికట్టాలని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధరకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని కార్మికుల హక్కులను పరిరక్షించాలని, కార్మికులు సాధించుకున్న చట్టాలను అమలు చేయాలని ఆమె ఈ సందర్భంగా తెలిపారు మహిళలకు రిజర్వేషన్ అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మహిళా రిజర్వేషన్ను తక్షణమే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఉపాధి హామీ పథకాన్ని యధాతనంగా కొనసాగించాలని ఆమె తెలిపారు.కాబట్టి కేంద్ర ప్రభుత్వం అవినీతి కార్పోరేట్ అనుకూల విధానాలను నిలిపివేసి ప్రజా సంక్షేమ పాలన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి  డిమాండ్ చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన పాదయాత్ర సంగమేశ్వర కాలనీ, హరిజనవాడ, పాత బాన్సువాడలో కొనసాగింది. ఈ కార్యక్రమంలోసిపిఐ బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జ్ దుబాస్ రాములు, డి శంకర్, శ్రీనివాస్, గంగాధర్, ఎల్లయ్య,, అబ్రహం, సర్దార్, అశోక్ గౌడ్, శివాజీ, అడబల్లి. రాజు, పోశెట్టి వార్ మాధవరావు, బసవంతరావు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.