8 August, 2026 | 6:58 PM

కూరగాయల రైతులకే అవకాశం

08-08-2026 02:37 PM

ముకరంపుర,(విజయ క్రాంతి): కశ్మీర్‌ గడ్డ రైతు బజార్‌లో కూరగాయలు పండించి విక్రయించుకునే రైతులకు మరియు గతంలో ఇక్కడ వ్యాపారం చేసుకున్న రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. శనివారం కశ్మీర్‌గడ్డ రైతు బజార్ సన్నకారు రైతుల సంక్షేమ సంఘం బాధ్యులు క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ మేయర్‌ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సంఘం బాధ్యులు మాట్లాడుతూ రైతు బజార్‌లో రైతుల సంక్షేమం కోసం నూతనంగా నిర్మించిన భవనంలో గదులు,స్టాల్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటు ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, వాటిని పూర్తిగా రైతులకే కేటాయించాలని కోరారు.

రైతుల విజ్ఞప్తిపై యాదగిరి సునీల్ రావు సానుకూలంగా స్పందిస్తూ... గతంలో కూరగాయలు అమ్ముకున్న రైతులకు, కొనుగోలుదారులకు సకల సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతోనే దాదాపు రూ. 10 కోట్ల ఖర్చుతో నూతన మార్కెట్ భవనాన్ని నిర్మించామని తెలిపారు. గతంలో కశ్మీర్‌గడ్డ రైతు బజార్‌ లో కూరగాయలు విక్రయించిన ప్రతి రైతుకు మళ్ళీ అదే విధంగా అవకాశం కల్పిస్తామని, ఎవరూ  ఆందోళనకు గురికావాల్సి న అవసరం లేదని భరోసా ఇచ్చారు.