17 March, 2026 | 3:33 AM

సిధారెడ్డికి కేంద్ర పురస్కారం

17-03-2026 01:45 AM

అనిమేష కవితా సంపుటికి సాహిత్య అకాడమీ అవార్డు

తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కలం

హైదరాబాద్, సిటీ బ్యూరో మార్చి 16 (విజయక్రాంతి): తెలంగాణ గడ్డపై పుట్టిన ధిక్కార స్వరం, అస్తిత్వ పోరాట ప్రతిబింబం, ప్రముఖ కవి నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన రచించిన అనిమేష కవితా సం పుటి 2026 సంవత్సరానికి గా నూ ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికైంది. ‘నాగేటి సాల్లల్ల నా తెలంగాణ’ అంటూ మట్టి వాసనను ప్రపంచానికి పరిచయం చేసిన సిధారెడ్డికి ఈ గౌరవం దక్కడం పట్ల తెలుగు సాహిత్య లోకంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ఉద్యమ కాలంలో తన పాటలతో కోట్లాది మందిలో స్ఫూర్తి నింపిన ఈ అక్షర సేనాని, నేడు జాతీయ స్థాయి గుర్తింపును సాధించారు. మానవాళిని వణికించిన కరోనా కాలంలో సమాజంలో చోటుచేసుకున్న విపరిణామాలు, సామాన్యు డి కష్టాలు, వలస జీవుల ఆవేదనను ఇతివృత్తంగా తీసుకుని నందిని సిధారెడ్డి అనిమేష కవితా సంపుటిని రచించారు. ఆనాటి భయానక పరిస్థితులను, బంధాల మధ్య తెగి పో యిన దారాలను, మానవత్వం ఆవిరైన సం దర్భాలను అత్యంత హృద్యంగా ఈ సంపుటిలో చిత్రించారు.

నిశ్శబ్దంగా సాగిన మృ త్యుఘోషకు అక్షర రూపమివ్వడమే కాకుం డా, ఆ విపత్కర పరిస్థితుల్లోనూ ఆ శను రేకెత్తించే కవితలను ఆయన ఇందులో పొందు పరిచారు. రాష్ట్రం  సిద్ధించిన తర్వాత ఏర్పడిన తెలంగాణ సాహిత్య అకాడమీకి నందిని సిధారెడ్డి తొలి చైర్మెన్‌గా పనిచేశారు. తన పదవీకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కవులను, రచయితలను ఏకం చేయడమే కాకుండా, తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పే అనేక సాహిత్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

సిద్దిపేట వేదికగా మంజీరా రచయితల సంఘం స్థాపించి కొన్ని దశా బ్దాలుగా సాహిత్య పరిమళాలను వెదజల్లుతున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమం లో సిధారెడ్డి పాటలు తూటాల్లా పనిచేసి ప్రజలను చైతన్యవంతం చేశాయి.  . ఈ పురస్కారం కింద రూ.లక్ష  నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపికను కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది.

తెలంగాణ ఆత్మ తెలిసిన కవి: సీఎం రేవంత్‌రెడ్డి

నందిని సిధారెడ్డికి తెలంగాణ ఆత్మ తెలిసిన కవికి దక్కిన సముచిత గౌరవం ఇది అ ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అ వార్డు రావడంపైఅభినందనలు తెలిపారు.  

గర్వించదగ్గ కవి సిధారెడ్డి: మాజీ సీఎం కేసీఆర్

తెలంగాణ మట్టి వాసన తెలిసిక కవిగా, తన సాహిత్యం ద్వారా తెలంగాణ జీవితాన్ని అక్షర బద్ధం చేసిన గర్వించదగ్గ కవి నందిని సిద్ధారెడ్డి అని మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. ఈ సందర్భంగా సిద్ధారెడ్డికి శుభాకాం క్షలు తెలిపారు. కరోనా సందర్భంగా ప్రపంచం ఎదుర్కొన్న సంక్షోభాన్ని, ముఖ్యం గా మానవ సంబంధాల విచ్ఛిన్నతలను కవి త్వం ద్వారా హృద్యంగా చిత్రీకరించిన, దీర్ఘ కవితా సంపుటి ‘అనిమేష’కు ఈ అవార్డు రావడం గొప్ప విషయమని కేసీఆర్         తెలిపారు. 

రాష్ట్రానికి గర్వకారణం: కేటీఆర్

ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమ కారు డు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం యావత్ తెలంగాణకే గర్వ కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు.  

సాహితీ ప్రస్థానానికి దక్కిన గుర్తింపు: హరీశ్‌రావు

నాగేటి సాల్లల్ల నా తెలంగాణ.. అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యో ధుడు నందిని సిధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం గర్వకారణమ ని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ అస్తిత్వాన్ని అక్షర బద్ధం చేసిన సిధారెడ్డి కృషి వెలకట్టలేనిదని హరీశ్‌రావు కొనియాడారు.