17 May, 2026 | 5:24 AM

కేంద్ర, రాష్ట్ర పథకాలు ప్రజల్లోకి వెళ్లాలి

17-05-2026 12:00 AM
  1. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
  2. దిశ సమావేశంలో కలెక్టర్‌తో కలిసి వివిధ శాఖలపై ఎంపీ సమీక్ష

రంగారెడ్డి, మే 16 (విజయక్రాంతి): కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా జిల్లా అధికారులు సమన్వయంతో పని చే యాలని చేవెళ్ల ఎంపీ ‘దిశ’ ఛైర్మన్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సీ నారాయణ రెడ్డితో కలిసి ఆయన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ, కలెక్టర్, వివిధ శాఖల అధికా రులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలి. పిల్లలకు పోషక విలువలతో కూడి న ఆహారం, గుడ్డుతో పాటు పాలు అందించాలి.

జిల్లాలో బాల్యవివాహాలను పూర్తిగా అరికట్టాలి, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. జిల్లాలో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని, స్థానిక మత్స్యకారులకు శిక్షణ ఇచ్చి, వలలు పంపిణీ చేయడం ద్వా రా వారికి ఆర్థిక అండగా నిలవాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయిం పులో స్థానికులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ముద్ర, విశ్వకర్మ పథకాలతో పాటు చిరు వ్యాపారస్తుల రుణ దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, లక్ష్యాల మేరకు రుణా లు అందించాలని చెప్పారు.

జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రహదారుల పనులను, మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ‘గోపాలమిత్ర’ పథకంలో భాగంగా పశువైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి తమ నియోజకవర్గాల సమస్యలను లేవనెత్తారు. అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, కిరణ్మయి, వివిధ శాఖ ల జిల్లా అధికారులు పాల్గొన్నారు.