10 August, 2026 | 7:21 PM

Breaking News

లోకకళ్యాణార్థం బీరంగూడలో ఘనంగా శతరుద్రాభిషేకం   •   అంబేద్కర్ నగర్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం   •   పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం   •   సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన పద్మా రెడ్డి   •   మానవతా దృక్పథంతో గల్ఫ్ కార్మికుడి మృతదేహం స్వదేశానికి   •   ఘనంగా లక్ష బిల్వార్చన పూజ   •   శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి విద్యార్థిపై దారుణ దాడి..!   •   శారాజిపేటలో డప్పుల కళాకారులకు డ్రెస్సుల పంపిణీ   •   ఎల్ హెచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా భూక్య మంగీలాల్ నాయక్ నియామకం   •   బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •  

మత్స్యకారులకు అన్యాయం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

10-08-2026 02:03 AM

ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్

గణపురం, ఆగస్టు 9 (విజయ క్రాంతి) : మత్స్యకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. ఆదివారం మండలంలోని గణపురం, చెల్పూర్ చెరువులను అరవింద్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మత్స్యకారులకు ప్రభుత్వాలు సరైన పథకాలు, హక్కులు అందించడంలో విఫలమవుతున్నాయని అన్నారు. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంలో లోపాలు ఉన్నాయని, నగదు రూపంలో ఇస్తే మత్స్యకారులు నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకోగలరని తెలిపారు.

వలలు, పడవలు, జీవరక్షణ జాకెట్లు అందించడంతో పాటు బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు రుణాలు, పథకాలపై అవగాహన కల్పించాలని కోరారు. మత్స్యకారులకు అన్యాయం చేస్తే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.