19 March, 2026 | 6:43 AM

రూ.50 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

19-03-2026 12:48 AM

అలంపూర్ మార్చి 18: వడ్డేపల్లి మండలంలో కొంకల గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.ఈ మేరకు బుధవారం గ్రామ సర్పంచి జ్యోతి వరదరాజులు చేతుల మీదుగా కొబ్బరి కాయ కొట్టి పనులు ప్రా రంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మా ట్లాడుతూ..ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమా ర్, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని తెలిపారు.

సీసి రోడ్ల నిర్మాణం చేపట్టడం వల్ల గ్రా మంలో మురుగు నీరు నిల్వలు,చెత్త సమస్య లు తగ్గి ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉం టాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కి సాన్ సెల్ నాయకులు ఎనుముల నాగరా జు, ఏఈ ప్రశాంత్,యోగి రెడ్డి , సూర్యప్రతాప్ రెడ్డి సెక్రటరీ పాల్గొన్నారు.