కోరెం కొండ పోచమ్మకు సీసీ రహదారి
రేపు ప్రారంభించనున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు
బోయినపల్లి:(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం కొండపోచమ్మ ఆలయం కు సిసి రహదారి నిర్మాణం పూర్తయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోరం కొండపోచమ్మ ఆలయం అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈ ఆలయంకు మట్టి రహదారి ఉండడంతో భక్తులు ఆలయముకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తులు స్థానిక నాయకులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దృష్టి కి తీసుకెళ్లగా ఆయన గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూపాయలు 50 లక్షలు సిసి రహదారి నిర్మాణం కు మంజూరు చేశారు.
దీంతో జెడ్పి రహదారి నుంచి కొండపోచమ్మ ఆలయం వరకు సీసీ రహదారి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు భక్తులు చక్కగా ఆలయానికి మోటార్ సైకిల్, కార్లు ఇతర వాహనాల్లో నేరుగా వెళ్తున్నారు. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ నుంచి సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరా కోసం 21 విద్యుత్ స్తంభాలు మంజూరు కాగా పనులు కూడా పూర్తయ్యాయి. దాతల సాయంతో బల్బులు అమర్చవలసి ఉన్నది. కానీ కొండ పోచమ్మ ఆలయం కు సీసీ రహదారి నిర్మాణం కావడంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు కాంగ్రెస్ నాయకులకు గ్రామస్తులు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
రేపు ఎమ్మెల్యే రాక
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కోరెం కొండ పోచమ్మ ఆలయానికి నిర్మాణం చేసిన సీసీ రహదారిని ప్రారంభించడానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేడు కోరెం గ్రామానికి ఆదివారం వస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు ప్రారంభోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రహదారి ప్రారంభం అనంతరం ప్రజలతో సమావేశం ఉంటున్నట్లు ఆయన తెలిపారు.






