1 April, 2026 | 8:16 PM

గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం

01-04-2026 06:17 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో  ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఈజీఎస్  నిధుల నుండి కేటాయించినా 15 పదిహేను లక్షల రూపాయలతో  శకుంతల ఇంటి నుండి  మల్లేశం ఇంటి వరకు బుధవారం సిసి రోడ్డు నిర్మాణం పనులు సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్, వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగినది.  కొన్ని సంవత్సరాలుగా రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న వార్డ్ ప్రజలు ఈ రోడ్డు నిర్మాణం చేయడంతో ఎమ్మెల్యే విజయరమణారావు కు ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు