అరుణాచల్‌ప్రదేశ్ సీఎంపై సీబీఐ విచారణ
సుప్రీంకోర్టు ఆదేశం
రెండు వారాల్లోగా విచారణ ప్రారంభించాలని స్పష్టీకరణ
16 వారాల్లోగా నివేదికను అందజేయాలన్న ధర్మాసనం
ఇటానగర్, ఏప్రిల్ 6: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమ ఖండూ తన కుటుంబసభ్యులకు చెందిన కంపెనీలకు ప్రభుత్వ కాం ట్రాక్టులు అప్పగించారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) విచారణకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అధికార దుర్వినియోగం, బంధుప్రీతితో తన కుటుంబసభ్యులకు వందల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కేలా సీఎం వ్యవహరిం చారనేది ప్రధా ఆరోపణ. మొత్తం రూ.1270 కోట్ల విలువైన కాంట్రాక్టులలో సీఎం పెమా కుటుంబానికి చెం దిన నాలుగు కంపెనీలు పాలుపంచుకున్నాయి.
దీంతో సీబీఐకి పూర్తిగా సహకరించాలని అరుణాచల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూ చించింది. అంతేకాదు, సీబీఐతో సమన్వయం కోసం ఒక నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. అలాగే, రికార్డులు తారు మారు కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టా లని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రాథమిక విచారణ సీబీఐ ప్రారంభించనుంది. జనవరి 2015 నుంచి డిసెంబరు 2025 వరకు పెమా ఖండూ నిర్ణయాలు వాటి అమలు తీరును సీబీఐ పరిశీలించనుంది.
నవంబరు 2015 నుంచి పదేళ్ల కాలంలో ప్రభుత్వ పనులకు టెండర్లు, కాంట్రాక్టుల కేటాయిం పు, అమలుపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. పిటిషన్‌లో ఆరోపించిన కాంట్రాక్టుల కేటాయింపుల వివరాలను సీబీఐ ప్రత్యే కంగా పరిశీలిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, ఆయన సోదరుడు త్సెరింగ్ తాషి, సవతి తల్లి రించిన్ డ్రెమా, వారికి సంబంధించిన కంపెనీలకు కేటాయించిన కాంట్రాక్ట్‌లను ప్రత్యేకంగా పరిశీలించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. 10 ఏళ్లలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తన కుటుంబానికి ప్రత్యక్షంగా ప్రయోజనం కలిగించేలా రూ.1,270 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు కేటాయించారనేది ప్రధాన ఆరోపణ.
దీనిపై ఎన్జీఓ వలంటరీ అరుణాచల్ సేన, సేవ మోన్ రీజియన్ ఫెడరేషన్ అనే స్వచ్ఛంధ సంస్థలు సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టగా.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, నేహా రాఠీలు వాదనలు వినించారు. పారదర్శక, బహిరంగ టెండర్ వ్యవస్థను పక్కనబెట్టి అవినీతి, బంధుప్రీతికి సీఎం పాల్పడ్డారని వాదించారు. దీంతో ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి 16 వారాల్లోగా నివేదికను అందజేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పు వెలువడిన రెండు వారాల్లోగా ప్రాథమిక విచారణ ప్రారంభించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.




