13 May, 2026 | 1:46 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

సేజ్ పాఠశాలలో నా మట్టి - నా దేశం నినాదంతో ఈ కార్నివాల్ కార్యక్రమం

22-11-2025 10:01 PM

ముఖ్యఅతిథిగా శ్రీనిధి యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ నరసింహారెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లిలో శనివారం నాడు సెజ్ పాఠశాల ప్రాంగణంలోఈ కార్నివాల్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.నామట్టి - నాదేశం అనే నినాదముతో  ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీనిధి విశ్వవిద్యాలయం ప్రో-ఛాన్సలర్ నరసింహ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ ఎస్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ  అభినందించారు. సేజ్ పాఠశాల విద్యార్థులందరూ సమిష్టిగా శ్రమించి సమగ్ర భారతావనిని ఈ కార్నివాల్ లో ఆవిష్కృతం చేశారు.

భాషలు, సంస్కృతులు, వైద్య, రవాణ, కృత్రిమ మేధస్సు లాంటి అనేకమైన  ప్రాచీనం నుండి నేటి ఆధునికత వరకే కాకుండా భవిషత్ లో ఎలాంటి సాంకేతికత రాబోతుందో తము నమూనాల ద్వారా విదార్థులు ఈ కార్నివాల్ లోప్రదర్శించారు. ఈ నమూనాలు విద్యార్థుల తల్లి దండ్రులను విశేషంగా  ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమము లో  ప్రిన్సిపల్ చైత్రరెడ్డి, అకాడమీ డైరెక్టర్ సీతామహాలక్ష్మి, డైరెక్టర్  రోహిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమమును విజయవంతం చేసినందుకు విద్యార్థినీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ నామట్టి - నాదేశం అనే నినాదాన్ని ప్రతిజ్ఞ చేశారు.