calender_icon.png 6 February, 2026 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్రణలో జాగ్రత్తలు తీసుకోవాలి

06-02-2026 01:03:01 AM

  1. పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఈనెల 8వ తేదీ లోపు ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలి

జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి

వనపర్తి, ఫిబ్రవరి 5 ( విజయక్రాంతి ) : బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్రణ విషయంలో అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన చాం బర్లో మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు ఎంపీడీవోలతో బ్యాలెట్ పేపర్ల ముద్రణ విషయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

మున్సిపాలిటీ పరిధిలో జరుగ నున్న మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల వారిగా పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తుల వారిగా జాగ్రత్తగా చూసుకోవాలని, బ్యాలెట్ పేపర్ క్రమ సంఖ్య, నాణ్యత తదితర అన్ని అంశాలు జాగ్రత్తగా చూసుకోవాలని ఆదేశించారు. అనంతరం వచ్చిన బ్యాలెట్ పేపర్లు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచి సి.సి. కెమెరా లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు పోలీస్ భద్రత కల్పించాలని సూచించారు. 

పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు

శుక్రవారం అన్ని మున్సిపాలిటీల పరిధిలో రెండవ దఫా ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శిక్షణ సందర్భంగా శుక్రవారం సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఒకరోజు శిక్షణ కార్యక్రమం అన్ని వసతులతో పకడ్బం దీగా నిర్వహించాలని సూచించారు.

ఈనెల 8వ తేదీ లోపు ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలి

ఓటర్లందరికీ బి.ఎల్. ఒ లు, వార్డు ఆఫీసర్ల ద్వారా ఓటరు స్లిప్పులు అందజేయాలని, పంపిణీ ప్రక్రియ ఫిబ్రవరి 8 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అభ్యర్థులకు వాహనాల అనుమతి మున్సిపల్ కమిషనర్ల ద్వారా జరగాలని, అదేవిధంగా పార్టీ సమావేశాలు, ర్యాలీలకు పోలీస్ అధికారుల నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అద నపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ లు తదితరులు టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.