calender_icon.png 6 February, 2026 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారంలో దూసుకెళ్తున్న సుప్రియ శ్రీనివాస్ గౌడ్

06-02-2026 01:01:35 AM

ఎల్లంపేట 10వ వార్డులో ఓటర్లను అభ్యర్థిస్తున్న బీజేపీ అభ్యర్థి

మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డు (ఎల్లంపేట్) లో బీజేపీ అభ్యర్థి గౌరయ్య గారి సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి తిరిగి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తన ను గెలిపించాలని కోరుతున్నారు. సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ప్రచారానికి అనూహ్యస్పందన లభిస్తోంది. వార్డు పరిధిలో యువకు లు, మహిళలు, కుల సంఘాల మద్దతు కూ డగట్టారు. సుప్రియ శ్రీనివాస్ గౌడ్ ప్రజల్లోనే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాల్గొన డం కలిసి వస్తోంది. శ్రీనివాస్ గౌడ్ బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్ మే నల్లుడు. శ్రీనివాస్ గౌడ్ భార్య సుప్రియ కౌన్సిలర్ పదవికి పోటీ చేస్తున్నారు.

వార్డు అభివృద్ధికి కృషి చేస్తా: సుప్రియ శ్రీనివాస్ గౌడ్ 

ఎల్లంపేటలోని పదవ వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని సుప్రియ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ము న్సిపాలిటీ నిధులతో రోడ్లు, నువ్వు కాలువలు నిర్మిస్తానన్నారు. మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. తనను అధి క మెజారిటీతో గెలిపించాలని కోరారు.