25 April, 2026 | 4:12 PM

ఎవరెన్ని కుట్రలు చేసినా చర్చలు సఫలం

25-04-2026 02:43 PM

తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్

నేటి నుంచి బస్సు సర్వీసుల పునరుద్ధరణ

తల్లాడ,సత్తుపల్లి,(విజయకాంత్): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎవరెన్ని కుట్రలు పన్నినా వారి ఆటలు సాగలేదని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్  అన్నారు. దీనితో శనివారం తెల్లవారుజామున నుండే  తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు పునరుద్ధరించబడ్డాయనీ ఆయన తెలిపారు.