మొక్క నాటు రక్షించు, చదువుల్లో రాణించు
26-07-2026 10:41 AM
బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చేరిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ అనురాధ వాతావరణ కాలుష్యం అందుకు అవసరమైన మొక్కల పెంపకం పైన అవగాహన కలిగిస్తున్నారు. పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థుల చేత మొక్క నాటించి వాటిని పరిరక్షించాలని సూచిస్తున్నారు. దీంతో విద్యార్థులు నాటిన చెట్టు తన చెట్టుగా భావించి పరిరక్షిస్తున్నారు. మరోవైపు మొక్కలు నాటడం వల్ల వాతావరణ పరిరక్షణతో పాటు వాటి ఆవశ్యకతను వివరిస్తున్నారు. మొక్క ఎదిగినట్టుగానే చదువుల్లో మీరు ఎదిగి ఉన్నతులుగా సమాజంలో గుర్తింపు పొందాలని సూచిస్తున్నారు. దీంతో విద్యార్థులకు చెట్ల ప్రాముఖ్యత తెలుస్తుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.






