మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మాల్తుమ్మెద గ్రామంలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి,డాక్టర్ రేవంత్ నాదన్ పాల్గొని రైతులకు వివిధ అంశాలైన యూరియా వాడకం తగ్గించడం,విరివిగా రసాయనాలు వాడడం వలన కలిగే నష్టాలు, పంట మార్పిడి, నీటి ఆద, మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాల వాడకం,సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కలిగించారు.
వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ...ప్రతి రైతు కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 11 అంకెల రైతు గుర్తింపు కార్డు నెంబర్ కోసం వ్యవసాయ విస్తరణ అధికారిని ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకు లింక్ ఉన్న మొబైల్ తీసుకొని సంప్రదించగలరని చెప్పడం జరిగింది.అదేవిధంగా ఫర్టిలైజర్ ఆప్ వానాకాలం సీజన్ యూరియా కోసం ప్రతి రైతు మొబైల్ నంబర్ను వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద అప్డేట్ చేసుకోమని రైతులకు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శోభ,ఆత్మ డైరెక్టర్లు లక్ష్మణ్ ఠాగూర్,దివిటీ కిష్టయ్య, పసులాది కిష్టయ్య,గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు, పంచాయతీ సెక్రెటరీ అశోక్, రైతులు వెంకట్ రెడ్డి,మల్లేష్, అంజయ్య,చంద్రయ్య,షరీఫ్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.






