ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును కలిసిన బూర్గంపాడు సీహెచ్‌సీ సూపరింటెండెంట్
12-08-2026 06:47 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) సూపరింటెండెంట్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనస్తీషియా వైద్య నిపుణులు జి. ప్రసాద్ బుధవారం మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూపరింటెండెంట్ జి. ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బూర్గంపాడు సీహెచ్‌సీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్‌డీసీ శివ తదితరులు పాల్గొన్నారు.






