ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపిన బీఎస్పీ నాయకులు
కరీంనగర్: బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు సంఘీభావం తెలుపుతూ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లాల శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ బస్ డిపోలో సమ్మె చేస్తున్న కార్మికులను కలిసి వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వారికి బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు..ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాతంగి అశోక్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి వారి శ్రమను దోచుకుందని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర రవాణా వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఆర్టీసీ కార్మికులను రోడ్డుపైకి లాగి, వారి పొట్ట కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 60 వేల మంది కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం సమ్మె చేస్తుంటే, ప్రభుత్వం కనీసం స్పందించకుండా ‘నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీ’ పేరుతో కాలయాపన చేయడం కార్మికులను వంచించడమేనని అన్నారు. 2023లో అసెంబ్లీ సాక్షిగా చేసిన విలీన చట్టాన్ని అమలు చేయడానికి మళ్ళీ కొత్త కమిటీలు ఎందుకు? ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే, తక్షణమే ‘సర్వీస్ రూల్స్’ ఖరారు చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
ప్రజలకు ఇబ్బంది - బాధ్యత ప్రభుత్వానిదే:
సమ్మె వల్ల కోట్లాది మంది సామాన్య ప్రయాణికులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కార్మికులు బాధ్యులు కారు.పంతాలకు పోయి చర్చలు జరపకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వమే దీనికి పూర్తి బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు.






