వాచ్‌మెన్ దంపతుల దారుణ హత్య
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో ఘటన
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పది పరీక్ష పూర్తయ్యే వరకు కూతురికి సమాచారం ఇవ్వని స్థానికులు
పటాన్ చెరు/మహబూబాబాద్, మార్చి 14(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో వాచ్‌మెన్ దంపతుల హత్య కలకలం రేపింది. పటాన్ చెరు మండలం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో భార్యాభర్తలను అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతు లు మహబూబాబాద్ జిల్లా గూడూరు మం డలం గన్యచక్ర తండాకు చెందిన ధరావత్ సోముల(45), ధరావత్ మంగమ్మ (40) గా పోలీసులు గుర్తించారు. మృతుడు గత మూడున్నర సంవత్సరాలుగా వెంకటేశ్వర రెడ్డి అనే బిల్డర్ వద్ద పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.అతనికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు పెళ్లి కాగా, చిన్న కూతురు సాని యా పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నది.
తల్లిదండ్రుల హత్యకు గురైన విషయం ఆమెకు చెప్పలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు క్యూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. జంట హత్యలకు సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు లు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని రామచంద్రాపురం ఏపీసీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
హత్య సమాచారం కుమార్తెకు చెప్పలేదు..
తల్లిదండ్రులు దారుణ హత్యకు గురికాగా, ఆ విషయాన్ని కన్న కూతురికి కొద్ది సేపు చెప్పకుం డా రహస్యంగా ఉంచి పదో తరగతి పరీక్ష రాయించిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరులో శనివారం జరిగింది. గూడూ రు మండలం గన్యా చక్ర తండాకు చెందిన ధరావత్ సోములు, మంగ మ్మ దంపతులు పటాన్‌చెరులో కూలి పను లు చేస్తూ, తమ కూతురిని గూడూరు హాస్ట ల్లో ఉంచి చదివిస్తున్నారు.
ఈ నేపథ్యంలో వారు అక్కడ దారుణ హత్యకు గురికాగా, కన్న కూతురు వసంత పదవ తరగతి పరీక్ష రాసేందుకు వెళ్లింది. అయితే తల్లిదండ్రులు హత్యకు గురయ్యారన్న వార్త వసంతకు చెప్పలేదు. పరీక్ష రాసిన తర్వాత హాస్టల్ వార్డెన్ తల్లిదండ్రులు చనిపోయిన విషయా న్ని వసంతకు తెలియజేసి వారి ఇంటికి తీసుకువెళ్లి బంధువులకు అప్పగించారు.




