26 June, 2026 | 9:08 PM

28 సంవత్సరాల తర్వాత కలుసుకున్న 1998–99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు

26-06-2026 08:20 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్టలోని సిద్ధార్థ మోడల్ హై స్కూల్ 1998–99 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 28 సంవత్సరాల తర్వాత శుక్రవారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, చిన్ననాటి స్నేహాలను మరింత బలోపేతం చేసుకున్నారు. తమ జీవితానికి బాటలు వేసిన గురువులను స్మరించుకుంటూ, వారికి ఘనంగా సన్మానం చేశారు.

ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందిస్తూ, జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ, తమ పాఠశాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని సంకల్పించారు. ఈ కార్యక్రమంలో 1998–99 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, 28 సంవత్సరాల అనంతరం ఒకరినొకరు కలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.