26 June, 2026 | 9:08 PM

పోగొట్టుకున్న సెల్ ఫోన్ల అప్పగింత

26-06-2026 08:16 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్  ద్వారా సేకరించి ఆరుగురు బాధితులకు మొబైల్ ఫోన్లను అప్పగించినట్లు ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఇందులో రెండు  మొబైల్ సంవత్సర క్రితం, నాలుగు మొబైల్స్ ఐదు నెలల్లోపు పోయినవి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. భువనేశ్వర్,  షాబాజ్ షేక్, నాగం నవీన్, జనార్ధన్ గీత, సట్ల గంగ సాయన్న, రవితేజ రామగిరి లకు అప్పగించినట్లు వివరించారు.