రైతు భరోసా పథకం కోసం దరఖాస్తుల ఆహ్వానం...
26-06-2026 07:24 PM
సుల్తానాబాద్ మండల వ్యవసాయ అధికారి పైడితల్లి..
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు వానాకాలం–2026 పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పథకం కోసం దరఖాస్తులు చేసుకోగలరని సుల్తానాబాద్ మండల వ్యవసాయ అధికారి పైడితల్లి శుక్రవారం సాయంత్రం తెలిపారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారిని (ఏ ఈ ఓ) ను సంప్రదించి, కొత్త పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ తో వెంటనే దరఖాస్తు చేసుకోగలరని పైడితల్లి కోరారు.






