తెలంగాణ ప్రజల గుండెల్లో... చిరస్థాయిగా బిఆర్ఎస్ పార్టీ
ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
పాల్గొన్న జవహర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు
జవహర్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బిఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని మాజీ సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఖ్యాతిగాంచాయని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండల్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణకు సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని, సంక్షేమంలో ప్రపంచంతో పోటీపడిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారేనని తెలిపారు.
తెలంగాణ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి కేసీఆర్ చేసిన కృషి యావత్ తెలంగాణ సమాజం మరవదన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన పోరాటంలో కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా నీళ్లను లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో నియామకాలు, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి నిధులు సాధించి తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లిన ఘనత ఒక్క కేసీఆర్ కి దక్కుతుందన్నారు. బంగారు తెలంగాణ కోసం కెసిఆర్ చేసిన కృషి యావత్ తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అన్నారు. అనంతరం పార్టీ జెండా ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.






