9 May, 2026 | 11:20 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ   •   ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం   •   కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •  

బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారు

29-11-2025 12:00 AM

 తాండూరు, 28 నవంబర్ (విజయక్రాంతి ): సర్పం పదవులతో పాటు వార్డు సభ్యులు టిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ సంఖ్యలో గెలవబోతున్నారని వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు . శుక్రవారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామ పంచాయతీ  సంగెం కాలాన్ సర్పం అభ్యర్థిగా కామిని మీనాక్షి అనిల్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నామినేషన్ సమర్పించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలకు మోసం చేసిందని విమర్శించారు.  మాయ మాటలతో ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల్లో ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన అన్నారు.