23 June, 2026 | 7:51 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా

23-06-2026 12:00 AM
  1. ఆయన నాయకత్వంపై సొంత పార్టీ తీవ్ర అసంతృప్తి 
  2. రోజురోజుకూ కోల్పోయిన ప్రజాదరణ
  3. లేబర్‌పార్టీ ఒత్తడితో రెండేళ్లు గడవకముందే రిజైన్
  4. తదుపరి ప్రధాని రేసులో ఆండీ బర్న్‌హామ్

లండన్, జూన్ 22: బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.. రెండేళ్లు గడవకముందే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బ్రిటన్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర అలజడి రేగిం ది. ఆ దేశ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కొత్త ప్రధానిని ఎన్నుకుని, సెప్టెంబర్ నాటికి ఆ బాధ్యతలను వారికి అప్పగించేలా ఒక కాలపట్టికను కూడా ఆయ న వెల్లడించారు. కొన్ని నెలలుగా సొంత పార్టీ అయిన ‘లేబర్ పార్టీ’లోనే ఆయన నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడం, ప్రజాదరణ రోజురోజుకూ పడిపోవ డంతో పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడికి తలొగ్గి కీర్ స్టార్మర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ రాజీనామాతో, బ్రిటన్ రాజకీయాల్లో గత 10 ఏళ్ల కాలంలో పూర్తి కాలం పదవిలో ఉండకుండానే అర్థాంతరంగా తప్పుకున్న ఆరో ప్రధానమంత్రిగా స్టార్మర్ నిలిచారు. లండన్‌లోని తన అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ వెలుపల స్టార్మర్ మీడియా తో మాట్లాడారు. పార్టీలోని సహచరుల ఆం దోళనలను, అభిప్రాయాలను తాను గౌరవిస్తున్నానని, అందుకే పక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అయితే, పార్టీ తదుపరి కొత్త నాయకుడిని (ప్రధానిని) ఎన్నుకునే వరకు తానే తాత్కాలిక (ఇంటరిమ్) ప్రధానిగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్టార్మర్ మాట్లాడుతూ జూలై 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీని భారీ మెజారిటీతో అధికారంలోకి తెచ్చిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఆరు ఏళ్ల క్రితం తాను లేబర్ పార్టీ బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీ పని అయిపోయిందని చా లా మంది అన్నారని, కానీ కష్టపడి పార్టీని మార్చి చూపామని అన్నారు.

అయినప్పటికీ, తదుపరి ఎన్నికల్లో పార్టీని నడిపించే సత్తా తనకు ఉందా లేదా అనే ప్రశ్నకు పార్టీ ఇచ్చి న సమాధానాన్ని అంగీకరిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘అధికార బదిలీ సజావుగా జరిగేలా‘ చూసేందుకు తన తదుపరి బాధ్యులకు ‘పూర్తిగా, నిస్సందేహమైన మద్దతు‘ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన వారసుడిని ఎంపిక చేసేందుకు కాలపట్టిక కోసం లేబర్ పార్టీ ‘నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ’(ఎన్‌ఈసీ)ని కోరనున్నారు.

జూలై 9న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, జూలై 17న ప్రారంభం కానున్న పార్లమెంట్ వేసవి విరామానికి ప్రక్రియ పూర్తవుతుంది. గతవారం జరిగిన కీలకమైన ఉప ఎన్నికలో విజయం సాధించిన ఆండీ బర్న్‌హామ్ స్టార్మర్ స్థానాన్ని భర్తీ చేసే రేసులో ముందున్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఆయన సోషల్ మీడియా పేర్కొన్నారు.