ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా
- అధికారులు కూల్చివేసిన మళ్లీ నిర్మాణాలు
- జిల్లా కేంద్రంలో ఓ బడా నేత బాగోతం
- రక్షణ చర్యలపై రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం
నిర్మల్ జూన్ 23 ( విజయక్రాంతి) నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య నగర్ లో కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతుంది. సర్వే నెంబర్ 554 లోని 29. 0 3 ప్రభుత్వం అసైన్మెంట్ చేసిన భూమిలో 2.20 ఎకరాల భూమి నిర్మల్ జిల్లా చెందిన ఓ రాజకీయ బడా నేత ఆక్రమణల్లోకి వెళ్లిందని ఆరోపణలు వినవస్తున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ భూములపై కన్నేసిన బడా వ్యాపారులు రాజకీయవేత్తలు రెవిన్యూ అధికారుల లొసగులను ఆసరాగా తీసుకుని అసైన్ మూమెంట్ భూములను ఆక్రమించుకొని దర్జాగా వెంచర్లు ప్లాట్లు చేసి విక్రయిస్తున్న సంబంధిత అధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదు.
దివ్య గార్డెన్ ప్రాంతంలో పేద రైతుల వద్ద తక్కువ ధరకు అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేసిన కొందరు ఆ భూమిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మల్లన్న గుట్ట సమీపంలో గల ఓ చెరువు అలుగు తూము మొత్తం తవ్వేసిన బడా నేతలు అలుగు పారకానికి చిన్నపాటి కాలువను ఏర్పాటు చేసి రెండు ఎకరాల అసైన్మెంట్ భూమిని ఆక్రమించుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పాటు అయిన తర్వాత భూములకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో ప్లాటు ధర 50 నుంచి 60 లక్షలకు పలుకుతుంది. రాజకీయ పలకపడుతూ రెవిన్యూ అధికారులను మత్తుగా చేసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దానికి రక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కూల్చేసిన మళ్లీ ఆక్రమణలు
జిల్లా కేంద్రంలోని 534 సర్వే నెంబర్లు ఓ నేత భూఆక్రములకు పాల్పడ్డారని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గత అక్టోబర్లో అప్పటి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన అప్పటి రెవిన్యూ అధికారులు వెంటనే ప్రభుత్వ అసైన్మెంట్ భూమి ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని గుర్తించి యంత్రాల సాయంతో కూల్చివేశారు. ఈ భూమి విలువ సుమారు ఐదు కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.
ఆ తర్వాత జిల్లా కలెక్టర్ బదిలీ కావడం తో ఆ నేత పెరిగి ఆ ప్రభుత్వ అసైన్మెంట్ భూముల ను ఇనుప కంచలు వేసి ఆక్రమించుకుంటున్నారని సమీప కాలనీవాసులు పేర్కొంటు న్నారు. ఐదు కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ భూమి ప్రభుత్వానికి సంబంధించిందిగా సరిహద్దులు పెట్టకపోగా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. పేద మద్దతు ప్రజలు గజం జాగాని ఆక్రమించుకుంటే హంగామా చేసే అధికారులు ఐదు కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న చర్యలు చేపట్టకపోవడంపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ అవసరాలకు భూమి కొరత ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ భూములను రక్షించుకోవలసిన అవసరం ఉందని చెప్తున్నారు.
స్టడీ సర్కిల్‌కు ఇవ్వాలని డిమాండ్
మల్లన్న గుట్ట సమీపంలో ప్రభుత్వ అసైన్మెంట్ లో గల 2.20 ఎకరాల భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకుని ఎస్సీ స్టడీ సర్కిల్ కు కేటాయించాలని దళిత సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఈ ప్రాంతంలో దళితులకు అసైన్మెంట్ భూములు ప్రభుత్వం కేటాయించి నప్పటికీ వారు తక్కువ ధరకి బడా నేతలకు విక్రయించుకున్నారని ఆ భూమిని కొన్న కొందరు వెంచర్లు వేసుకొని అమ్ముకుంటున్నారని దళిత సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు ఎప్పటికైనా ప్రభుత్వ భూ ఆక్రములపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ భూములను కాపాడాలని పట్టణ వాసన కోరుతున్నారు.






