12 May, 2026 | 11:44 AM

Breaking News

మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •  

గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు

04-01-2026 03:48 PM

పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ

మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): గ్రంథాలయంలో పాఠకులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి గ్రంథాలయంలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యా రంగం, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. గ్రంథాలయాలలో పాఠకులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు, సామాగ్రి సమకూర్చడం జరిగిందని, ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తుందన్నారు. గ్రంథాలయాల్లో పాఠకులకు, అభ్యర్థులకు అవసరమైన తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.