20 July, 2026 | 5:27 PM

Breaking News

ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •   తల్లిదండ్రుల త్యాగమే విద్యార్థుల విజయానికి పునాది: స్ఫూర్తి ఫౌండేషన్   •   కొడంగల్‌లో సీఎం రేవంత్ రెండు రోజుల పర్యటన   •   బోధన్ మధు మలంచ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల దుస్థితి   •  

రెడ్డి, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బోనాల మహోత్సవం

20-07-2026 12:06 AM

అమ్మవారికి విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు

వేములవాడ, జులై 19, (విజయ క్రాంతి): ఆషాఢ మాసం బోనాల మహోత్సవాల సం దర్భంగా వేములవాడ పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ అమ్మవారి కటాక్షం రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల ఉత్సవాలు సమాజంలో ఐక్యతను, సాంస్కృతిక విలువలను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొంది స్తాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు ప్రభుత్వ విప్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.