8 August, 2026 | 9:26 PM

ఎస్వి అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల సంబరాలు.

08-08-2026 08:12 PM

ఎర్రుపాలెం,(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని ఎస్ విఅకాడమీ  ఆధ్వర్యంలో ఘనంగా బోనాల సంబరాలు  నిర్వహించారు. శనివారం నాడు ఎస్ వి అకాడమీ విద్యార్థులు స్కూల్ నుండి రింగ్ సెంటర్ వరకు నిర్వహించిన కోలాటం,  పోతురాజు వేషధారణలో విద్యార్థులు,  సాంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన కోలాటం పోతురాజు వేషధారణ గ్రామ పౌరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తొండ సతీష్ కుమార్, కరస్పాండెంట్, మిరియాల శ్యాంప్రసాద్, గిరి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.