18-02-2026 01:29:29 AM
‘మెడికవర్’ డాక్టర్ అంజలిరెడ్డి
నిజామాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాం తి): వేసవిలో దాహం ఎక్కువగా ఉండటం, బలహీనత, తలనిరుత్తరం, నోరు ఎండిపోవడం, మూత్రం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే అది డీహైడ్రేషన్ సంకేతం కావచ్చు అని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, బయట పని చేసే వారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని మెడికవర్ ఆస్పత్రి డాక్టర్ అంజలిరెడ్డి (జనరల్ ఫిజీషియన్) తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఎండ తీవ్ర త, అధిక చెమటలు, తగినంత ద్రవాలు తీసుకోకపోవడం వల్ల శరీరంలో నీరు, ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి. డయేరియా వంటి వ్యాధుల సమయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది అయితే హిట్ స్ట్రోక్, మసిల్ క్రాంప్స్, రోజువారి పనులు, తీవ్రమైన శారీరక శ్రమ క్రీడల సమయంలో కూడా డిహైడ్రేషన్ ఏర్పడుతుంది.
ఓఆర్‌ఎస్ ద్రావణం వేసవిలో శరీ రానికి అవసరమైన ద్రవాలు, లవణాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు, అవసరమైనప్పుడు ఎలక్ట్రోలైట్ ద్రావణాలు తీసుకోవడం మంచిది. బయటకు వెళ్లేటప్పుడు తల కవర్ చేసుకోవాలి’ అని తెలిపారు.