14 August, 2026 | 11:06 AM

నిండు గర్భిణీ ఆత్మహత్య

14-08-2026 10:11 AM

ముస్తఫా నగర్ లో విషాదం..

గంభీరావుపేట, ఆగస్టు 14(విజయక్రాంతి): నిండు గర్భిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో చోటుచేసుకుంది.మండలంలోని ముస్తఫా నగర్ గ్రామానికి చెందిన బొంతల రమ్య (25) గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు తొమ్మిది నెలల గర్భిణి కావడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. ఆమెకు భర్త సురేష్, నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నారు.సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.