14 August, 2026 | 11:22 AM

స్వచ్ఛ కార్మికులకు దుస్తులు, సామగ్రి పంపిణీ

14-08-2026 10:37 AM

నర్సాపూర్: మున్సిపల్ స్వచ్ఛ కార్మికుల సంక్షేమం(Welfare of Municipal Sanitation Workers), ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా వారికి కొత్త దుస్తులు, ఆఫ్రన్స్‌తో పాటు ప్రజారోగ్యానికి అవసరమైన సామగ్రిని  మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి మాచునూరి లక్ష్మీరాజు యాదవ్, కమిషనర్ చెరుకు సాయికుమార్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. స్వచ్ఛ కార్మికులు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నందున వారికి అవసరమైన రక్షణ సామగ్రి, దుస్తులు అందజేసినట్లు వారుతెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు అఫ్రీన్, మహమ్మద్ జరీనా బేగం, దుర్గప్ప సరళ, అంతారం సుధీర్ గౌడ్, చింతకుంట శ్రీకాంత్, మన్నె నిరంజన్ దాస్, మేనేజర్ వైట్ల మధుసూదన్‌తో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.