25 July, 2026 | 11:21 AM

నేడు మరోసారి సీజేపీతో కేంద్రం చర్చలు

25-07-2026 10:27 AM

 పరిష్కారం లభిస్తుందా లేక ప్రతిష్టంభన కొనసాగుతుందా? 

న్యూఢిల్లీ: కేంద్రం, సీజేపీ ప్రతినిధులు నేడు మరోసారి భేటీ కానున్నారు. CJP ప్రతినిధులు, ప్రభుత్వం మధ్య మూడవ విడత చర్చలు మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నాయి. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రంతో సీజేపీ మరోసారి చర్చించనుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాంల్సిందేని సీజేపీ(CJP) తేల్చిచెప్పింది. ఇవాళ జరగనున్న చర్చల్లో కీలకమైన నిర్ణయాలు వెలువడే అవకాశముంది.

శుక్రవారం నాడు కేంద్రమంత్రులతో(Union Ministers) భేటీ అయిన కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janata Partyధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, చనిపోయిన విద్యార్థులకు కుటుంబాలకు 1 కోటి నష్టపరిహారం, విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని మూడు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందు పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా(Dharmendra Pradhan resigns) మినహా మిగిలిన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం సానుకూలత చూపింది. పరిష్కారం లభిస్తుందా లేక ప్రతిష్టంభన కొనసాగుతుందా? అనే అంశం చర్చనీయాంశం అయింది.