10 April, 2026 | 4:51 AM

పాత టెండర్ల రద్దుపై బీజేపీ ఆందోళన

10-04-2026 12:59 AM

నిర్మల్, ఏప్రిల్ ౯ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణ అభివృద్ధికి మంజూరైన రూ. 15 కోట్లకు సం బంధించి పాత టెండర్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కృషి ఫలితంగానే నిర్మల్ పట్టణాన్ని అమృత్ పథకంలో చేర్చారని, ఆ మేరకే కేంద్రం ద్వారా మొదటగా 62.50 కోట్లతో పట్టణంలో త్రాగు నీటి సౌకర్యానికి మంజూరైనట్లు తెలిపారు.

ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం ద్వారా 42 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. పట్టణ అభివృద్ధికి అత్యవరంగా 50 కోట్లు అవసరమని ఎమ్మెల్యే మంజూరు చేస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్ర మంలో పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, సీనియర్ నాయకులు మెడిసెమ్మ రాజు, పట్టణ బీజేపీ కౌన్సిలర్లు సాదం అరవింద్‌తో పాటు మాజీ కౌన్సిలర్లు, పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.