22 April, 2026 | 4:03 PM

ఆర్టీసీ సమ్మెకు బిజెపి మద్దతు..

22-04-2026 02:36 PM

ఉట్నూర్,(విజయక్రాంతి):  తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ  ఉద్యోగుల సంఘాల నాయకుల పిలుపుమేరకు  ఉట్నూర్ ఆర్టీసీ డిపో ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పట్టారు. బుధవారం ఉట్నూర్  లోని ఆర్టీసీ డిపో ముందు  సమ్మె చేస్తున్న ఉద్యోగులకు బిజెపి నాయకులు పూర్తి మద్దతు పలికారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెతో  బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు తమ సమస్యలు డిమాండ్లను  వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు  బిజెపి మండల శాఖ అధ్యక్షుడు  వెంకటేష్, సీనియర్ బిజెపి నాయకుడు శ్రీపతి లింగ గౌడ్  ల తో పాటు బిజెపి నాయకులు పాల్గొన్నారు.