6 April, 2026 | 5:02 PM

Breaking News

బిజెపి కార్యాలయంలో జెండా ఎగురవేత   •   దేశ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం   •   బీజేపీ చీఫ్ రాంచందర్ రావు సన్మానించిన మీర్ ఫిరాసత్ అలీ బక్రీ   •   విరాట్ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి   •   కోల్‌కతాపై దాడి చేస్తామన్న పాక్.. మోదీపై మమతా బెనర్జీ విమర్శలు   •   కరీంనగర్‌లో ఘనంగా భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు   •   ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. వీఐపీ గేటులోంచి దూసుకొచ్చిన మాస్క్ మ్యాన్ కారు   •   ఉపాధి హామీ పనిలో విషాదం – మహిళ మృతి   •   గోపాలరావుపల్లిలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ఘనంగా నిర్వహణ   •   మాజీ ఎంపీటీసీ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం   •  

మల్లాపూర్ మండలంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

06-04-2026 03:17 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలో బీజేపీ శ్రేణులు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మండలంలోని మల్లాపూర్, వెంకట్రావుపేట గ్రామంలోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సామాజిక లక్ష్యాల సాధన కోసం స్థాపించబడిన పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకులు శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరియు పండిత్ దీన దయాల్ ఉపాధ్యాయ త్యాగాలను స్మరించుకొని వారి ఆశయాలను కొనసాగిస్తూ నేటి వరకు ఆదర్శవంతమైన నాయకుల జీవితాలను గుర్తు చేసుకోవడం ద్వారా కార్యకర్తలు మరింత స్ఫూర్తి పొందాలని సూచించారు.దేశ సేవే ధర్మంగా, ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సబ్కా సాథ్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న పార్టీ ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మి, మండల ఉపాధ్యక్షుడు లవంగ శివ, ప్రధాన కార్యదర్శి కాంతయ్య చారి, బిజెవైయం జిల్లా ఉపాధ్యక్షుడు బైనా ప్రశాంత్, సీనియర్ నాయకులు డబ్బా రాజారామ్, గడ్డం నర్సిరెడ్డి, బియ్యం సురేష్, శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ముస్కిరి రాజకుమార్, బూత్ అధ్యక్షుడు ఇల్లేందుల, మండల కార్యవర్గ సభ్యుడు పన్నాల శ్రీనివాస్, మనోజ్ కుమార్, ఎర్ర రాజు, రాజేందర్, రాజశేఖర్, శ్రీనివాస్, తుక్కరెడ్డి, తిరుపతి, మహేష్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు