6 May, 2026 | 2:26 AM

తాడ్వాయిలో బీజేపీ సంబురాలు

06-05-2026 01:04 AM

తాడ్వాయి, మే, 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో సోమవారం రాత్రి బీజేపీ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి మూడు రాష్ట్రాల్లో బిజెపి ఘన విజయం సాధించినందుకు నాయకులు మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డుపై టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మిఠాయిలు పంచుకొని నృత్యాలు చేశారు.

అనంతరం నాయకులు మాట్లాడుతూ... దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వమే ఉండాలని కోరుకుంటున్నారన్నారు. దేశ ప్రజలు బిజెపియే కావాలని కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో సైతం బిజెపి ఘనవిజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షులు వెలమ సంతోష్ రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు గంగారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు హోటల్ శ్రీను, నాయకులు వెంకట్రావు, రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, రవీందర్ రెడ్డి, నర్సారెడ్డి, స్వామి రెడ్డి, సదాశివుడు, దత్తాత్రి,కిషన్ రావు, శ్రీకాంత్ రెడ్డి, రాజు, మహేష్, బాపు రెడ్డి, వెంకట్ రెడ్డి, ధర్మారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.