తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు
హైదరాబాద్: తెలుగు ఫిలింఛాంబర్(Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజీ విధానంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 15 మందితో కమిటీ వేయాలని తెలుగు ఫిలింఛాంబర్ నిర్ణయించింది.కమిటీలో ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు ఎగ్జిబిటర్లు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు ఉండనున్నారు. రెండు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఫిలింఛాంబర్ ఆదేశించింది. రెండు నెలల్లో సమస్య పరిష్కారం అవుతూందని సి. కల్యాణ్ వెల్లడించారు. సినిమాల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. అరుపులు కేకల మధ్య ఛాంబర్ సమావేశం కొనసాగింది. సమావేశ ప్రారంభంలో నాగవంశీతో సునీల్ నారంగ్ కు వాగ్వాదం జరిగింది. దిల్ రాజు, మరికొందరు జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు. 10 నిమిషాల అరుపులు, కేకలతో సమావేశం సాగినట్లు తెలుస్తోంది.






