14 July, 2026 | 3:21 PM

Breaking News

పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •   పహాని పత్రాల కొరకు గిరిజనేతర రైతులు ఎదురు చూపులు   •   గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా డాక్టర్ రాజా నియామకం   •   Jr NTR పొలిటికల్ రూమర్లకు చెక్: ఎన్టీఆర్‌ కార్యాలయం కీలక ప్రకటన   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఘనంగా జన్మదిన వేడుకలు   •   ఎఫ్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్   •   పీహెచ్‌డీ స్కాలర్స్, లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలి   •   గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎస్‌బీఐటీ విద్యార్థి   •  

బిగ్ లీడర్లకు చేదు అనుభవం

14-02-2026 01:43 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పు సీనియర్ బిగ్ లీడర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో పలు పర్యాయాలు కీలకమైన పదవులను అధిరోహించిన సదరు సీనియర్ లీడర్లకు ఎన్నికల్లో చుక్కెదురైంది. ప్రజలు తమ తీర్పుతో ఇక విశ్రాంతిలో ఉండమని చెప్పినట్టే అయింది. రాజకీయాల్లో ఓటమి ఓటమి గెలుపులు సహజమైనప్పటికీ. సదర్ నాయకుల తీరు ప్రజా విశ్వాసానికి దూరం కావడమే ఈ ఓటమికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు తన సతీమణి  మాజీ చైర్ పర్సన్  సరస్వతి, సీనియర్ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకుడు గెల్లి రాజలింగు, తన కోడలు సంధ్య, సీనియర్ మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ తన సతీమణి బండి ఉమాను, సీనియర్ కాంగ్రెస్ గెల్లి జయరాం తన కూతురు విజయలక్ష్మి బరిలోకి ఉంచారు.  మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ కౌన్సిలర్ ఎండి అఫ్జల్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెటు ఆశించి బంగపడ్డారు. ఆయనకు ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం రాలేదు.

టికెట్ ఇవ్వలేదు. దీంతో తమ కోడలు సౌజన్యను పోటీలో దింపారు.  ఓటర్లు ఆదరించలేదు. శుక్రవారం జరిగిన కౌంటింగ్లో ప్రజలు ఇచ్చిన తీర్పు బిగ్ లీడర్ల కుటుంబ సభ్యుల అభ్యర్థిత్వని ఆమోదించలేదు. తిరస్కరించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్లోని కొందరు లీడర్లు రిజర్వేషన్లు కలిసి రాక వారి అనుచరులను  రిజర్వేషన్ల ప్రకారం అయా వార్డుల్లో రంగంలోకి దింపి బంగపడ్డారు. అనుచరులు ఓటమీ పాలయ్యారు. ఈ ఫలితాలు వారికి రాజకీయంగా తీవ్రంగా దెబ్బతీశాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన భారీ షాక్ కు కకావికలయ్యారు. ఓటమిని పరాభావంగా భావించకుండా తమను తాము సమిక్షించుకుంటే మంచిదనీ పరిశీలకులు సలహా ఇచ్చారు.