14-02-2026 01:40:56 PM
యుద్ధం స్టార్ట్ చేస్తా
రాసి పెట్టుకోండి.. కరీంనగర్ మేయర్ పీఠం మాదే
హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు(Telangana Municipal election results ) వెలువడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో హంగ్ ఏర్పడింది. దీంతో నేతలు క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు కేంద్రమంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) వార్నింగ్ ఇచ్చారు. రెండు పార్టీలపై విమర్శలు చేశారు.
'కరీంనగర్ మేయర్ పీఠం మాదే.. రాసి పెట్టుకోండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తే కరీంనగర్ నుంచే యుద్దం స్టార్ట్ చేస్తా. మీకు బీజేపీ కార్యకర్తల దమ్ము, శక్తి తెలియదు" ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలకు బండి సంజయ్ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మేయర్ పీఠం ఎలా దక్కించుకుంటాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అని ఎప్పటి నుంచో చెప్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతుందని స్పష్టం చేశారు.