28 July, 2026 | 1:02 AM

సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలి

28-07-2026 12:15 AM

కలెక్టర్ అంకిత్  రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ

లక్ష్మీదేవిపల్లి, జూలై 27, (విజయక్రాంతి):జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు, వై ద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా  ఆసుపత్రిలోని ప్రతి వా ర్డును సందర్శించి పరిశుభ్రత, పారిశుద్ధ్య ని ర్వహణ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

ఆసుపత్రి ఆవరణ, వార్డులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని, రోగులు ఆసుపత్రికి వచ్చిన నాటి నుంచే ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. రక్త పరీక్షల విభాగాన్ని సందర్శించిన కలెక్టర్ మలేరియా, డెంగ్యూ, హెచ్‌ఐవీ నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్ కిట్ల లభ్యత, నిర్వహిస్తున్న రక్త పరీక్షల వివరాలను తెలుసుకున్నారు.

విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూ చించారు. మందుల కొరత ఏర్పడకుండా ముందస్తుగా ఇండెంట్లు పంపించి అవసరమైన మందులను నిల్వ ఉంచుకోవాలని అ ధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట లక్ష్మీదేవి పల్లి తాసిల్దార్ శిరీష, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వైద్యులు సిబ్బంది సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.