27 May, 2026 | 2:24 AM

నేటి తరానికి బెల్లి లలిత స్ఫూర్తి

27-05-2026 12:00 AM

బీసీ సంఘం మండల అధ్యక్షులు కొప్పు రామకృష్ణ

సంస్థాన్ నారాయణపూర్, మే 26: అణగారిన వర్గాల చైతన్యానికి అనునిత్యం తన పాటల ద్వారా ఊపిరిలూదిన విప్లవ కెరటం బెల్లిలలిత ప్రస్థానం నేటి యువతరానికి ఆదర్శమని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కొప్పు రామకృష్ణ అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బెల్లి లలిత 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బిసి యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ కోసం బహిరంగ సభ వేదికలపై పాటలు పాడుతూ తెలంగాణలోని ప్రతి పల్లెలో చైతన్యాన్ని తీసుకువచ్చిన గొప్ప విప్లవకారిణి అని కొనియాడారు.

ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మండల నాయకులు బైకని నరేందర్ యాదవ్,యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు అందె నరేష్ యాదవ్,అంతటి స్వామి,రేవణపల్లి గోపాల్,కడారి లచ్చయ్య,మల్లయ్య, అర్లబీరయ్య,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.