31 May, 2026 | 12:59 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీర్నంది సర్పంచ్

31-05-2026 11:25 AM

* ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేయాలి: వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  చేరారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోఖానాపూర్ మండలం బిర్నంది సర్పంచ్ నవీన్ యాదవ్ బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్  మాట్లాడుతూ.. అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు, ఎమ్మెల్యే  నియోజకవర్గాన్ని  అభివృద్ధి చేసేందుకు మంజూరు చేయిస్తున్న చేస్తున్న అబివృద్దికి ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నాం అని అన్నారు. కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పతకాలను ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే గారు సూచించారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్,కడెం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.