బొడ్డోని కుంట సుందరీ కరణ పనులు వేగంగా చేయాలి
25-06-2026 02:55 PM
నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు
ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బొడ్డోని కుంట సుందరీకరణ పనులు వేగంగా చేయాలని నిర్మల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు .గురువారం ఆయన కుంట వద్ద జరుగుతున్న పనులను పరిశీలించడానికి వచ్చారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ పనులలో అలసత్వం చేయరాదని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అన్నారు. ఆయన వెంట ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, తాసిల్దార్ సుజాత రెడ్డి, కమిషనర్ సుందర్ సింగ్, సిబ్బంది ఉన్నారు.






